News January 22, 2026

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ‘నిఘా’ వైఫల్యం

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత గాలిలో దీపమైంది. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మెడికల్ కౌన్సిల్ నిబంధనల కోసం పెట్టిన 12 మినహా, మిగిలినవన్నీ మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. నిర్వహణ లోపంతో కీలక నేరాలు జరిగినప్పుడు ఫుటేజీ లభించక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ కరువైందని రోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.

Similar News

News February 2, 2026

ఖమ్మం: మిరప తోటలో ప్రేమ.. కూలీలకు పెళ్లి చేసిన రైతు!

image

నేలకొండపల్లి(M) ముటాపురం బిల్యాతండాలో ఒక రైతు తన ఉదారతతో మానవత్వాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి మిరప కోతకు వచ్చిన కూలీలు పూల్‌సింగ్‌, ఆశాలు ప్రేమలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న రైతు భూక్యా మోహన్‌రావు.. వారిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో వీరన్న స్వామి సన్నిధిలో వివాహం జరిపించి, ఆశీర్వదించారు. కూలీల పట్ల రైతు చూపిన ప్రేమను స్థానికులు అభినందించారు.

News February 2, 2026

ఖమ్మం: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఉపాధి, భూ సమస్యలు, పెన్షన్లు, గృహాల కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి, విచారణ వేగవంతం చేయాలని సూచించారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించి పదవీ విరమణ చేసిన 7గురు అధికారులను కలెక్టర్ సన్మానించారు.

News February 2, 2026

సత్తుపల్లి ఆలయంలో చిల్లర వదిలెళ్లారు

image

సత్తుపల్లి జవహర్ నగర్‌లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి గడ్డపలుగుతో హుండీని పగులగొట్టిన దొంగలు, అందులోని సుమారు రూ.20 వేల నోట్లను ఎత్తుకెళ్లారు. అయితే, బరువుగా ఉన్నాయనో ఏమో కానీ సుమారు రూ.5 వేల విలువైన నాణేలను అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.