News January 22, 2026

భద్రాద్రి జిల్లాలో 37 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

image

కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 9,278 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,407 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణకు 550 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు వెల్లడించారు.

Similar News

News February 9, 2026

కాకినాడ: తీరప్రాంత పర్యాటకానికి కొత్త శోభ

image

కాకినాడ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 67.83 కోట్లు కేటాయించిందని MP తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. పార్లమెంటులో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ బదులిస్తూ.. హోప్ ఐలాండ్, కోరింగ, కోటిపల్లి సర్క్యూట్‌ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో తీరప్రాంత పర్యాటకానికి కొత్త శోభ రానుందని ఎంపీ పేర్కొన్నారు.

News February 9, 2026

ఎప్‌స్టీన్ మరణశాసనం.. ఒక రోజు ముందే రాసేశారా?

image

US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ 2019 AUG 10న మాన్‌హట్టన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతడి మరణ ప్రకటన AUG 9వ తేదీనే రూపొందించినట్టు తాజాగా విడుదలైన ఫైల్స్ చూపిస్తున్నాయి. అది ఆత్మహత్య అని అధికారులు చెప్పినా తేదీలో వ్యత్యాసం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనితో పాటు 9వ తేదీ రాత్రి CCTV దృశ్యాలు, చనిపోయాక తీసిన ఫొటోల్లో అతడి ఫస్ట్ నేమ్‌ తప్పుగా ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి.

News February 9, 2026

NGKL: జిల్లాలో ముగిసిన మున్సిపల్ ప్రచారం

image

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల బహిరంగ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టారు. మైకులు మూగబోవడంతో పోలీసులు మద్యం, నగదు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 13న ఫలితాలు వెలువడనున్నాయి.