News January 22, 2026

నాలుగో మేయర్ కోసం NZB నగరం ఎదురు చూపు

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు మేయర్లు పనిచేశారు. ప్రస్తుతం నాలుగో మేయర్ కోసం నగరం ఎదురు చూస్తోంది. మొదటి మేయర్‌గా కాంగ్రెస్ నుంచి ధర్మపురి సంజయ్, రెండో మేయర్‌గా ఆకుల సుజాత (BRS), మూడో మేయర్‌గా దండు నీతూ కిరణ్ (BRS) పని చేయగా నాలుగో మేయర్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Similar News

News March 3, 2026

NZB: రూ.3.90 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ సోమవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 39 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.90 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 2, 2026

NZB: హోలీ పండుగకు పటిష్ట భద్రత ఏర్పాట్లు: సీపీ

image

హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పేర్కొన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో సహజసిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలన్నారు.

News March 2, 2026

NZB: అదనపు కలెక్టర్‌గా దిలీప్ కుమార్ బాధ్యతలు

image

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో ప్రభుత్వం దిలీప్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతల స్వీకారం అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.