News January 22, 2026
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ మార్కెట్ రోడ్డులో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సాగే ఈ వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, కళ్యాణ మండపం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 2, 2026
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలలో బరిలో 698 మంది

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. మొత్తం 60 డివిజన్లలో 698 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. వీరు దాఖలు చేసిన 1,231 సెట్ల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. నగరంలో కొత్తగా విలీనమైన 6వ డివిజన్ (బొమ్మకల్) లో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 32, 49వ డివిజన్లలో అత్యల్పంగా ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు.
News February 2, 2026
KNR వైభవంగా వేంకటేశ్వరుని శోభాయాత్ర

కరీంనగర్ నగరంలోని మార్కెట్ రోడ్ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గజ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నీరాజనాలు పలికారు. గుర్రాలు, ఒంటెలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
News February 2, 2026
జమ్మికుంట: మొదలైన బుజ్జగింపులు.. లేదంటే బేరసారాలు!

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన రెబెల్ అభ్యర్థులను తప్పుకోవాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుజ్జగిస్తున్నాయి. 30 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 55, బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ నుంచి 41 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అదనంగా ఉన్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. బుజ్జగింపులకు లొంగని వారితో నేతలు బేరసారాలు ప్రారంభించారు.


