News January 22, 2026

గ్రీన్ క్లైమేట్ ఫండ్‌తో మత్స్యకారులకు అండ: కలెక్టర్

image

గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలో నిర్వహించిన సమీక్షలో అలంకార చేపలు, పీతల పెంపకం, సముద్ర నాచు యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా మత్స్య సంపద పెంపుదల, ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News February 6, 2026

కృష్ణా: SSC పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో అవకాశం

image

పదో తరగతి (SSC) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ SSC ఎగ్జామినేషన్ బోర్డు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి గురువారం తెలిపారు. పరీక్ష ఫీజును ఇప్పటివరకు చెల్లించని విద్యార్థులు రూ.1000ల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ తత్కాల్ పథకం ఈనెల 6 నుంచి 12 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

News February 5, 2026

నేలపై కూర్చున్న కృష్ణాజిల్లా కలెక్టర్

image

మచిలీపట్నంలోని ఎస్‌ఎన్‌ గొల్లపాలెం పంచాయతీ పరిధిలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షర ఆంధ్ర (ఉల్లాస్)’ కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. అనంతరం ఆయన నేలపై కూర్చుని తరగతుల నిర్వహణ, హాజరు, బోధనా విధానాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. వయోజనులు చదువుతో స్వావలంబన సాధించాలన్నారు. అక్షరాస్యత కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదమని సూచించారు.

News February 5, 2026

క‌ష్ణాజిల్లాలో 6 బార్ల ఎంపిక

image

జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన బార్ లైసెన్సుల కోసం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మచిలీపట్నం లాటరీ విధానాన్ని నిర్వహించారు. మొత్తం 11 బార్లలో 6 బార్లకు 37 దరఖాస్తులు వచ్చాయన్నారు. గురువారం లాటరీ విధానం ద్వారా మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 5 బార్లు, గుడివాడ మున్సిపాలిటీలో 1 బారుకు లైసెన్సులు మంజూరు చేశారు. గుడివాడలో 4, పెడనలో 1 బార్‌కు దరఖాస్తులు లేకపోవడంతో వాటి లాటరీని రద్దు చేశారు.