News January 22, 2026

ఆర్‌ఓబీలతో ట్రాఫిక్ కష్టాలకు చెక్: కలెక్టర్

image

రైల్వే క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏలూరు జిల్లాలో రోడ్డు ROBల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఏలూరు, దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలోని 27 పెండింగ్ పనులపై ఆమె చర్చించారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

Similar News

News February 19, 2026

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఉమ్మడి కృష్ణా మీదుగా సంబల్‌పూర్(SBP)- ఈరోడ్(ED) మధ్య నడుస్తున్న స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.08311 SBP- ED రైలు మార్చి 4 నుంచి 25 వరకు ప్రతి బుధవారం, నం.08312 ED- SBP మధ్య నడిచే రైలు మార్చి 6 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు కైకలూరు, గుడివాడలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.

News February 19, 2026

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలి: BHPL కలెక్టర్

image

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎంపికైన 8 పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆధునిక విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని పేర్కొన్నారు.

News February 19, 2026

పాక్‌పై విమర్శలు.. హాకీ కెప్టెన్‌పై వేటు

image

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ యాజమాన్యం తమను పట్టించుకోలేదని <<19176695>>విమర్శలు<<>> గుప్పించిన పాక్ హాకీ కెప్టెన్ అమ్మాద్ షకీల్ భట్‌పై వేటు పడింది. పాక్ హాకీ ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేసినందుకు రెండేళ్ల పాటు సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాలో బసకు ఏర్పాట్లు లేక రోడ్లపైనే గంటలకొద్దీ తిరిగామని, సొంత ఖర్చులతోనే మేనేజ్ చేసుకున్నట్లు భట్ చెప్పడం చర్చనీయాంశమైంది.