News January 23, 2026
అరకు చలి ఉత్సవ్‌ను అత్యంత వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

పర్యాటకులు, ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమన్వయంతో మూడు రోజుల పాటు అరకు చలి ఉత్సవ్‌ను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అరకు చలి ఉత్సవ్-2026 నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు సమావేశం నిర్వహించారు. జనవరి 30,31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ఉత్సవ్ జరుగుతుందన్నారు. స్థానిక సంస్కృతి సంప్రదాయాలు, అరకు అందాలు ప్రపంచానికి చాటి చెప్పేలా నిర్వహించాలన్నారు.
Similar News
News February 22, 2026
NTR: చెన్నై వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), H. నిజాముద్దీన్ (NZM) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నంబరు 06019 MAS- NZM రైలును సోమవారం నుంచి మార్చి 9 వరకు ప్రతి సోమవారం, నంబరు 06020 NZM- MAS రైలును ఫిబ్రవరి 26 నుంచి మార్చి 12 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలిలో ఆగుతాయన్నారు.
News February 22, 2026
పరీక్షల వేళ డీజేలకు నో ఎంట్రీ.. ఎస్పీ హెచ్చరిక

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఆటంకం కలగకుండా ధ్వని కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా డీజేలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ బేబీ డాన్సులు, స్టేజ్ ప్రోగ్రాములు నిర్వహించరాదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
News February 22, 2026
రాజమండ్రి: ఎస్పీ వార్నింగ్.. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

జిల్లాలో రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు తమ అరాచకాలను మానుకోవాలని, లేనిపక్షంలో వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్‌హెచ్ఓల ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.


