News April 27, 2024
రైల్వేకోడూరు: YCPలోకి జనసేన కీలక నేతలు

రైల్వేకోడూరులోని స్థానిక వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం జనసేన రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కుప్పాల జ్యోతి, కుప్పాలా కిరణ్, వీపీఆర్ కండ్రిక మాజీ సర్పంచ్ సుబ్బరామరాజు వైసీపీలోకి చేరారు. వీరికి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల ఛైర్మన్ సుకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 7, 2025
చంద్రగ్రహణం.. ఒంటిమిట్ట ఆలయం మూసివేత

ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే కడప జిల్లాలోని పలు ఆలయాలు పొలతల మల్లేశ్వరస్వామి, పులివెందులలోని వెంకటేశ్వర స్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి, రంగనాథస్వామి ఆలయం, గండి వీరాంజనేయస్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేయనున్నట్లు గండి EO వెంకటసుబ్బయ్య తెలిపారు.
News September 7, 2025
3 నెలల్లో స్మార్ట్ కిచెన్ల నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

కడప జిల్లాలోని 33 మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాల్లో స్మార్ట్ కిచెన్ నిర్మాణాల అంచనాలు, టెండర్లు, మెటీరియల్ సంబంధిత అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. 3 నెలల్లో పూర్తయ్యేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్నారు.
News September 7, 2025
కడప జిల్లాను ప్రథమ స్థానంలోకి తేవాలి: కలెక్టర్

నీతి అయోగ్ నిర్దేశించిన అంశాల్లో జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలను సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్ లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ శనివారం కడపలోని ఓ కన్వెన్షన్ హాలులో “సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం” జరిగింది.