News April 27, 2024
చేవెళ్ల: 17 మంది నామినేషన్ల తిరస్కరణ
చేవెళ్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. అధికారులు నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. సరైన ఫార్మాట్‌లో లేని నామినేషన్లను తిరస్కరించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి మొత్తం 64 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్లమెంట్ స్థానానికి దాఖలైన నామినేషన్లలో 17 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 47 నామినేషన్లకు జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ ఆమోదం తెలిపారు.
Similar News
News November 26, 2024
సిటీలో ఎటు చూసినా యాపిల్ పండ్లే
కొద్దిరోజులుగా నగరంలో యాపిల్స్ ధరలు బాగా తగ్గిపోయాయి. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ నుంచి HYDకు ఇటీవల వీటి దిగుమతులు బాగా పెరిగాయి. మంచి క్వాలిటీ ఉన్న పండ్లు డజన్ రూ.180కే లభిస్తున్నాయి. బాటసింగారం, MJ మార్కెట్‌తో పాటు బోయిన్‌పల్లి మార్కెట్‌కు రోజూ అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఈ పరిస్థితి జనవరి నెలాఖరు వరకు ఉంటుందని బాటసింగారం మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు.
News November 26, 2024
రాజ్యాంగ దినోత్సవం: సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన సీఎస్
భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం డా.బీ. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సెక్రటేరియట్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతనం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట్‌రావు, పలువురు అదనపు కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 26, 2024
హైదరాబాద్‌ను కాపాడుకుందాం: వామపక్షాలు
మతోన్మాద విద్వేష శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుందామని వామపక్షాలు పిలుపునిచ్చాయి. బాగ్‌లింగంపల్లిలోని SVKలో “మతోన్మాద, విద్వేష శక్తుల నుంచి HYDను కాపాడుకుందాం” అని వామపక్షాల నగర సదస్సును నిర్వహించారు. గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మత ఘర్షణలు జరగాలని కొన్ని మతతత్వ శక్తులు కోరుకుంటునట్లు ఉందని CPM నేత శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.