News January 23, 2026
కొమరవెల్లి మల్లన్నకు కోటి ఆదాయం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. గత 23 రోజుల్లో స్వామివారికి రూ.1,01,24,258 నగదు వచ్చినట్లు ఈఓ వెంకటేశ్ తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 5.6 కిలోల వెండి, 30 విదేశీ నోట్లు భక్తులు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News February 10, 2026
NZB: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

రెంజల్ మండలం సాఠాపూర్‌లో సామియ ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సాఠాపూర్ నుంచి బోధన్ వైపు వస్తున్న బంతి అనే వ్యక్తి బైక్.. దేవయ్య, నాగేందర్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో గాయపడిన వారికి 108 సిబ్బంది గంగామణి, సతీశ్ ప్రథమచికిత్స చేసి, అనంతరం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News February 10, 2026
పెనుకొండ: రెండో పెళ్లి చేసుకొని 30 తులాల బంగారంతో పరారైన మహిళ!

నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి తనను మోసం చేసిందని పెనుకొండకు చెందిన సుబ్బారావు ASP అంకిత సురానాను కోరారు. మొదటి భర్తకు విడాకులివ్వకుండానే తనను రెండో పెళ్లి చేసుకొని, తన వద్ద ఉన్న 30 తులాల బంగారం, పత్రాలు ఎత్తుకెళ్లిందని ఫిర్యాదు చేశారు. నెల్లూరులో ఆరా తీయగా ఆమె నిత్యం పెళ్లిళ్లతో పలువురిని మోసగిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చారు.
News February 10, 2026
KMR: ‘తెరవెనుక రాజకీయం’ ఫలితాలను మారుస్తుందా..?

కామారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో రాజకీయం తెరవెనుకకు మళ్లింది. అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను ఆకర్షించేందుకు శక్తియుక్తులను వాడుతున్నారు. తమ ప్రత్యర్థుల ఓటు బ్యాంకుకు కన్నం వేసి ఆ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు ఓటరు తీర్పును ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈనెల 13న తేలనుంది.


