News January 23, 2026

కొమరవెల్లి మల్లన్నకు కోటి ఆదాయం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. గత 23 రోజుల్లో స్వామివారికి రూ.1,01,24,258 నగదు వచ్చినట్లు ఈఓ వెంకటేశ్ తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 5.6 కిలోల వెండి, 30 విదేశీ నోట్లు భక్తులు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Similar News

News January 26, 2026

నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ కాంపా) 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో పీజీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://moef.gov.in/

News January 26, 2026

మట్టెవాడ భోగేశ్వర ఆలయ విశేషాలు

image

వరంగల్(D) మట్టెవాడలోని భోగేశ్వర ఆలయం చాలా విశిష్టమైనది. ఇక్కడి శివలింగం కింద 11 లింగాలు ఉండటం విశేషం. అందుకే ఒక్కసారి అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేక ఫలం దక్కుతుందని నమ్మకం. ఈ లింగానికి ఎన్ని నీళ్లతో అభిషేకం చేసినా, ఆ నీరు ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా అంతర్ధానం కావడం మరో విశేషం. ప్రతిరోజు రాత్రి ఒక పాము(భోగి) వచ్చి స్వామిని సేవిస్తుందని, అందుకే దీనికి భోగేశ్వర ఆలయమని పేరు వచ్చిందని ప్రతీతి.

News January 26, 2026

బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందువులకి మాత్రమే ప్రవేశం!

image

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించేందుకు ఆలయ కమిటీ (BKTC) సిద్ధమైంది. చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన ఈ టెంపుల్స్‌తో పాటు, కమిటీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని BKTC అధ్యక్షుడు హేమంత్‌ ద్వివేది తెలిపారు. త్వరలో జరిగే బోర్డు మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముంది. ఏప్రిల్‌ 23న బద్రీనాథ్‌ ఆలయం తెరుచుకోనుంది.