News January 23, 2026
బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
859 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తులు

TG: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి(24వ తేదీ) నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr.అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్ తదితర పోస్టులకు ఏడో తరగతి-డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. 18-46 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tshc.gov.in
News January 23, 2026
దక్షిణ కోస్తా రైల్వే జోన్ చుట్టూ వివాదం!

AP: విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ బౌండరీస్ చుట్టూ వివాదం రాజుకుంటోంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం, జూరిడిక్షన్ అంశం చర్చనీయాంశమైంది. వాల్తేర్ డివిజన్ ఆదాయానికి కీలకమైన కొత్తవలస-కిరండల్ లైన్‌ను ఒడిశా పరిధికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. దీంతో స్వయం సమృద్ధి కలిగిన రైల్వే జోన్ కావాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
News January 23, 2026
JC vs పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హై అలర్ట్

AP: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. JC ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి పరస్పరం సవాల్ విసురుకున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరి ఇళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి సవాల్ విసరగా.. సిద్ధమంటూ ఆయన ఇంటి ముట్టడికి JC వర్గీయులు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ TDP కౌన్సిలర్లు పెద్దారెడ్డిపై PSలో ఫిర్యాదు చేశారు.


