News January 23, 2026
తిరుపతి: SC, STలకు గమనిక

SC, ST సమస్యలపై తిరుపతి కలెక్టేరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. పోలీస్, అటవీ శాఖతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. అర్జీలను డైరెక్ట్‌గా కలెక్టర్‌కు సమర్పించవచ్చు.
Similar News
News February 2, 2026
KNR: రేపటితో ముగియనున్న ‘బి-ఫామ్’ల గడువు

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అభ్యర్థులు తమ పార్టీల అధికారిక ‘బి-ఫామ్’లను సమర్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఆలోపు పత్రాలు అందని పక్షంలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల కేటాయింపుపై పార్టీల అగ్రనేతలు కసరత్తు కొనసాగిస్తుండగా, ఆశావహులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
News February 2, 2026
ఖమ్మం: మిరప తోటలో ప్రేమ.. కూలీలకు పెళ్లి చేసిన రైతు!

నేలకొండపల్లి(M) ముటాపురం బిల్యాతండాలో ఒక రైతు తన ఉదారతతో మానవత్వాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి మిరప కోతకు వచ్చిన కూలీలు పూల్‌సింగ్, ఆశాలు ప్రేమలో పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న రైతు భూక్యా మోహన్‌రావు.. వారిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నారు. సొంత ఖర్చులతో వీరన్న స్వామి సన్నిధిలో వివాహం జరిపించి, ఆశీర్వదించారు. కూలీల పట్ల రైతు చూపిన ప్రేమను స్థానికులు అభినందించారు.
News February 2, 2026
జిల్లాలో ఈ-పంట నమోదు నూరుశాతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఈ-పంట నమోదు నూరుశాతం పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో సోమవారం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎరువుల పంపిణీ, సబ్సిడీపై విత్తనాలు, పంట రుణాలు, పంట నష్ట పరిహారం అందించేందుకు, ధాన్యం సేకరణ, తదితర అంశాలలో ఈ-పంట నమోదై ఉండాలన్నారు.


