News January 23, 2026

నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

image

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.

Similar News

News March 15, 2026

మచిలీపట్నంలో చికెన్ ధరల హీట్.. కేజీ ఎంతంటే!

image

మచిలీపట్నం మాంసం మార్కెట్లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. పట్టణ ప్రాంతంలో మటన్ ధర కేజీ రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.300 పలుకుతోంది. చేపల మార్కెట్‌లో బొచ్చె కిలో రూ.200, సీలావతి రూ.170కి విక్రయిస్తున్నారు. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 15, 2026

NLG: తల్లి సూసైడ్.. బాధలోనూ పరీక్షకు హాజరు

image

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన సైదమ్మ అనారోగ్యంతో మతిస్తిమితం కోల్పోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారితే పదో తరగతి పరీక్ష రాయాల్సిన కూతురు మౌనిక తీవ్ర విషాదంలో పడింది. పాఠశాల ఉపాధ్యాయులు బాలికను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే మౌనిక పరీక్ష రాసి తర్వాత తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.

News March 15, 2026

వేసవి.. కోళ్ల దాణా విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లకు దాణాను తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇవ్వడం మంచిది. అలాగే వాటికి పెట్టే ఆహారంలో అవసరమైన మోతాదులో విటమిన్స్, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంత మేర తగ్గించాలి. విటమిన్-c కూడా దీనిలో ఉండేలా చూసుకోవాలి. అందుకే వేసవిలో కోళ్లకు ఎలాంటి దాణా అందిస్తే మంచిదో తెలుసుకోవడానికి వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.