News January 23, 2026
KNR: స్థానిక సంస్థల నుంచే ఉన్నత శిఖరాలకు..

ఉమ్మడి KNR జిల్లా నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్, రామగుండం మాజీ MLAలు సోమారపు సత్యనారయణ, కోరుకంటి చందర్, KNR మాజీ MLAలు చల్మెడ ఆనందరావు, జువ్వాడి చంద్రశేఖర్‌రావు, ఇందుర్తి మాజీ MLA బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ MLCలు సంతోష్ కుమార్, గోపాల్ రావు తదితరులు కార్పొరేటర్ల నుంచే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
Similar News
News March 29, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలు ఉన్నవారు https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వినతుల స్థితిని 1100 నెంబర్ లో తెలుసుకోవచ్చని చెప్పారు.
News March 29, 2026
IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.
News March 29, 2026
ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.


