News January 23, 2026

సంగారెడ్డి: నేడే పరీక్ష.. హాజరు కాకుంటే ఫెయిల్

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుక్రవారం (నేడు) నైతికత, మానవ విలువల పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఈ పరీక్షకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News March 7, 2026

HYD: తెలుగువర్సిటీలో జ్యోతిష ఝరి

image

HYD తెలుగు విశ్వవిద్యాలయం NTR ఆడిటోరియంలో నిర్వహించిన రసఝరి కార్యక్రమంలో వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యతను వివరించారు. ఖగోళ గ్రహాల గమనాలపై నిషిత అధ్యయనం, కచ్చితమైన కాలనిర్ణయంతో జ్యోతిషం శాస్త్రీయ ప్రమాణంతో ఉండాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన శతదిన విద్య ప్రణాళికలో భాగంగా జరిగిన కార్యక్రమంలో జ్యోతిష శాఖ విద్యార్థులు ‘దారిదీపం’ నాటకాన్ని ప్రదర్శించారు.

News March 7, 2026

విటమిన్ల కోసం వీటిని తీసుకోండి!

image

శరీర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి విటమిన్లు అత్యవసరం. క్యారెట్లు, లివర్‌లో విటమిన్ A ఉంటుంది. B1- తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2- పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశెనగ. B5- అవకాడో, గుడ్లు. B6- అరటిపండు, సాల్మన్ ఫిష్. B7- గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B12- చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్స్. E- సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం. C -నారింజ, జామ. SHARE IT

News March 7, 2026

ఖాకీ కొలువుల కోసం DSNRలో భారీ ర్యాలీ!

image

పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సహనం నశించింది. 20వేల పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న దిల్​సుఖ్​నగర్​లో భారీ ర్యాలీకి పోలీస్ నిరుద్యోగ JAC పిలుపునిచ్చింది. వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలని, జీవో46ను రద్దు చేయాలని శనివారం పోస్టర్ రిలీజ్ చేశారు. లాంగ్ జంప్ 3.8Mకు తగ్గించాలని కోరారు. సర్కారు కాలయాపన చేస్తే ఆక్రోశం తప్పదని ఆకాశ్, శంకర్ బృందం హెచ్చరించింది.