News January 23, 2026
సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయాలి: కలెక్టర్

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 14,000 సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విజయానంద్ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విజయానంద్ తెలిపారు.
Similar News
News March 22, 2026
టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
News March 22, 2026
సొంత భూమికి సొమ్ము దక్కకనే వృద్ధుడి ఆత్మహత్య: ఎస్ఐ

భూమి అమ్మిన డబ్బులు ఇవ్వకుండా కొనుగోలుదారులు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన <<19446112>>వృద్ధుడు<<>> ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రుపాలెం SI రమేష్ తెలిపారు. బనిగండ్లపాడుకు చెందిన యన్నం వెంకటరామిరెడ్డి(70) తనకు ఉన్న 3గుంటల ఖాళీ స్థలాన్ని ముగ్గురికి విక్రయించారు. వారు కొంత నగదు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన డబ్బుల కోసం వారిని అడగగా, భయభ్రాంతులకు గురిచేశారని ఎస్ఐ అన్నారు.
News March 22, 2026
రేపు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.


