News January 23, 2026
నేడు ఏ రంగు దుస్తులు ధరించాలంటే..?

వసంత పంచమి నాడు పసుపు రంగుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇది జ్ఞానానికి, కొత్త చిగురులకు, సూర్యకాంతికి చిహ్నం. ఈరోజున భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి పూజలో పాల్గొంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పూజలో పసుపు రంగు పువ్వులు, పసుపు అక్షింతలు వాడటంతో పాటు, నైవేద్యంగా పసుపు రంగు వంటకాలు సమర్పిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యాబుద్ధులు సొంతమవుతాయని నమ్మకం.
Similar News
News February 24, 2026
కేరళం అనే పేరు ఎలా వచ్చింది?

కేరళ పేరు మలయాళంలో కేరళంగానే ఉండేది. కానీ ఆంగ్లంలో అది కాస్త కేరళగా మారి అధికారిక పేరుగా స్థిరపడిపోయింది. తాజాగా కేంద్రం <<19227139>>మార్పుకు<<>> ఆమోదం తెలిపింది. ఈ పేరు 257BCEలోనే చేర వంశస్థులను సూచిస్తూ అశోక చక్రవర్తి శిలాశాసనంలో ‘కేరళపుత్ర’గా ప్రస్తావించబడింది. ‘చేరం’ నుంచే కేరళం వచ్చిందనే వాదన ఉంది. కేరం అంటే కొబ్బరిచెట్టు, అళం అంటే భూమి అని, వీటి నుంచే కేరళం వచ్చిందని మరికొన్ని థియరీలు చెబుతున్నాయి.
News February 24, 2026
అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్!

దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలకు HPV వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే Gardasil ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027 నాటికి 2.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాయి. <<19154747>>సర్వైకల్<<>> (గర్భాశయ) క్యాన్సర్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి.
News February 24, 2026
కీరదోసలో పండు ఈగ – నివారణ

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోయి దిగుబడి తగ్గిపోతుంది. వీటి నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగులను నివారించడానికి విషపు ఎరలను తయారు చేసుకోవాలి.


