News January 23, 2026

భాగ్యనగరానికి మరో ‘అమృత్ భారత్’.. రూట్ మ్యాప్ ఇదే!

image

TG: చర్లపల్లి – తిరువనంతపురం మధ్య కొత్త అమృత్ భారత్ 2.0 ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. PM మోదీ శుక్రవారం దీన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7.15కి చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం కేరళ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. అమృత్ భారత్‌లో RAC టికెట్లు ఉండవు.

Similar News

News February 19, 2026

త్వరలో 2,947 పోస్టుల భర్తీ: మంత్రి రవికుమార్

image

AP: ఈపీడీసీఎల్ పరిధిలో 2,947 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి రవికుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. 581 ఎనర్జీ అసిస్టెంట్లు, 1,260 జూనియర్ లైన్‌మెన్, 1,084 అసిస్టెంట్ లైన్‌మెన్, 22 లైన్‌మెన్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

News February 19, 2026

ఒకేఒక్కడు.. చరిత్ర సృష్టించాడు

image

T20Iలలో విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ చరిత్ర సృష్టించారు. ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, 4 క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్‌గా(మెన్స్/ఉమెన్స్) రికార్డు నమోదు చేశారు. T20WCలో నాన్ వికెట్ కీపర్‌గా 4 క్యాచ్‌లు పట్టిన ఐదో ప్లేయర్‌గానూ నిలిచారు. గతంలో డారెన్ సామీ(WI)vsIRE, మార్క్రమ్(SA)vsBAN, మ్యాక్స్‌వెల్(AUS)vsNAM, మున్సే(SCOT)vsITA ఈ ఘనత సాధించారు. కాగా ఇవాళ ఇటలీపై 42 రన్స్ తేడాతో విండీస్ గెలిచింది.

News February 19, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు

image

బీబీనగర్‌లోని AIIMS 3పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BSc(నర్సింగ్), GNM, BSc(రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్/EMT) అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.30K, నర్సింగ్ ఆఫీసర్‌, టెక్నీషియన్‌కు రూ.40K చెల్లిస్తారు. సైట్:aiimsbibinagar.edu.in