News January 23, 2026

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

image

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్‌ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.

Similar News

News February 25, 2026

అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి సంధ్యారాణి

image

AP: అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఇందులో భాగంగా 7,000 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 55,746 అంగన్వాడీ కేంద్రాలు, 257 ICDS ప్రాజెక్టుల ద్వారా గర్భిణులు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో హాజరు శాతం 70 నుంచి 96 శాతానికి చేరిందన్నారు.

News February 25, 2026

లలితా సహస్ర నామాలు పఠిస్తే..?

image

లలితా సహస్రనామ పారాయణం సకల కోరికలను నెరవేర్చే మహామంత్రం. అగస్త్యుడి కోరిక మేరకు హయగ్రీవుడు ఈ వెయ్యి నామాలను ఉపదేశించారు. ఈ స్తోత్రం 183 శ్లోకాల సమాహారం. దీనిని భక్తితో, ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణం చేస్తే అపమృత్యువు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ‘ప్రతి నామం ఓ మంత్రం. అర్థం తెలుసుకుని చదివితే అఖండ ఫలితముంటుంది. సృష్టికి మూలమైన ఆ తల్లి అనుగ్రహం కోసం ఇది శ్రేష్ఠం’ అంటున్నారు పండితులు.

News February 25, 2026

OBC సర్టిఫికెట్ ఇలా అప్లై చేసుకోండి

image

TG: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు OBC సర్టిఫికెట్ ఎంతో కీలకం. ఇందుకోసం కొన్ని డాక్యుమెంట్లతో మీసేవా సెంటర్లలో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారం, ఐడీ&అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్, పాత కాస్ట్(కుల ధ్రువీకరణ)& ఇన్‌కమ్ సర్టిఫికెట్, అఫిడవిట్ సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు రూ.45.
Share It