News January 23, 2026

గవర్నర్‌కు ‘ఖమ్మం’ రుచుల విందు

image

నేడు సూర్యాపేట జిల్లాకు రానున్న గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కోసం ఖమ్మం వంటకాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ‘అమ్మ మెస్‌’, ‘రెస్టిన్‌’ హోటల్‌ నిర్వాహకులు ఏకంగా 32రకాల శాకాహార వంటకాలతో మెనూ ఖరారు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనసకాయ బిర్యానీ, పచ్చిమిర్చి టమాట పచ్చడి సిద్ధం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు ఈ హోటల్స్ విందు అందించాయి.

Similar News

News February 14, 2026

సింగరాయకొండ: బీచ్ ఫెస్టివల్ మ్యాప్‌ను విడుదల చేసిన అధికారులు

image

సింగరాయకొండ మండలం పాకలలో జరిగే బీచ్ ఫెస్టివల్‌కు అధికారులు మ్యాప్ విడుదల చేశారు. పార్కింగ్ జోన్ బీచ్ సమీపానికి ఎడమవైపు కేటాయించారు. అక్కడి నుంచి ఉత్సవ ప్రాంగణానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. కాగా.. సాగర్ తీరానికి వెళ్లేందుకు 3 ప్రధాన రహదారులు ఏర్పాటు చేయగా.. వీవీఐపీలకు మరో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. కాగా ఫుడ్ జోన్, షాపింగ్ జోన్, ఫెస్టివల్‌కు ఆకర్షణీయం కాగలవని అంటున్నారు.

News February 14, 2026

నర్సాపూర్: నాడు 47తో ఓటమి.. నేడు 213తో గెలుపు

image

గత పురపాలక ఎన్నికల్లో నర్సాపూర్ 10వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 47 ఓట్లతో ఓటమి పాలైన అంతారం సుధీర్ గౌడ్.. ఈసారి పట్టుదలతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2వ వార్డు బరిలో నిలిచి, బీజేపీ ప్రత్యర్థిపై 213 ఓట్ల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు. ఓటమికి కుంగిపోకుండా ప్రజాసేవే లక్ష్యంగా పోరాడి గెలవవచ్చని ఆయన నిరూపించారు.

News February 14, 2026

NZB: మేయర్ పీఠం ‘హస్త’గతానికి యత్నాలు

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం ‘హస్త’గతం చేసుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. 60 స్థానాల్లో BJP 28, కాంగ్రెస్17, MIM 14 సీట్లు, BRS 1 సీటు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ MIM, BRS మద్దతు కూడగట్టుకొని మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అదే జరిగితే గత పాలకవర్గంలో ఎదురైన పరిస్థితే మళ్లీ BJPకి ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.