News January 23, 2026
GHMCలో భారీ మార్పులు!

GHMC తన IT వ్యవస్థను మారుస్తోంది. హాజరు, పన్నులకే పరిమితం కాకుండా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తోంది. డేటా ఇంటిగ్రిటీని కాపాడేందుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా సిస్టమ్ ఇంటిగ్రేటర్‌ను ఎంపిక చేయనున్నారు. ఫీల్డ్ లెవల్ యాక్టివిటీస్‌ను రియల్ టైమ్‌లో చూసేలా ఈ ప్లాట్‌ఫారమ్ డిజైన్ చేశారు. దీంతో ఫీల్డ్ రిపోర్టుల్లో తప్పుడు సమాచారానికి తావుండదు.
Similar News
News January 23, 2026
శ్రీశైల మల్లన్న దంపతులకు ఘనంగా ఊయల సేవ

లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల మల్లన్న దంపతులకు శుక్రవారం రాత్రి ఊయల సేవ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలో స్వామి, అమ్మవారిని రకరకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పుష్పార్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రమణీయంగా సాగిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
News January 23, 2026
‘రిపబ్లిక్ డే‘ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

AP: రిపబ్లిక్ డే ని మొదటిసారి ఈ ఏడాది అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో నిర్వహించేందుకు CRDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమరావతి రైతులకు ప్రత్యేక VIP గ్యాలరీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 13 వేల మందికి వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవాలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేపట్టేవారు.
News January 23, 2026
చిత్తూరు జిల్లాలో భూ సమస్యలే ఎక్కువ..!

చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ డేకు అర్జీలు భారీగా వస్తున్నాయి. డిసెంబర్, జనవరి 19వ తేదీ వరకు ఒక్క రెవెన్యూ శాఖపైనే 1,238 అర్జీలు అందాయి. డిసెంబర్‌లో 742 ఫిర్యాదులకు 638 పరిష్కరించి, 78 రిజెక్ట్ చేశారు. 26 పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో 496 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా 290 పరిష్కరించి, 42 రిజెక్ట్ చేయగా.. 164 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది.


