News January 23, 2026

ప్రభుత్వ బడుల్లో కేంబ్రిడ్జి పాఠాలు!

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేలా కేంబ్రిడ్జి వర్సిటీ(UK)తో GOVT ఒప్పందం చేసుకోనుంది. దీనిద్వారా జాయింట్ రీసెర్చ్, కరిక్యులమ్ రూపొందిస్తారు. 8-10 తరగతుల్లో కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్‌లైన్ కోర్సులు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రవేశపెడతారు. AU, IIT తిరుపతి సహా ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్సిటీ భాగస్వామ్య కోర్సులు నిర్వహిస్తారు. ఈమేరకు దావోస్‌లో మంత్రి లోకేశ్ వర్సిటీ VCతో చర్చించారు.

Similar News

News February 20, 2026

GREAT: ఓటమి నుంచి ప్రపంచ రికార్డుల వరకు!

image

మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన యువతలో స్ఫూర్తి నింపే పోస్ట్ చేశారు. మొదట్లో ఎవరూ తన వీడియోలు చూడలేదని, అందరూ తనను హేళన చేస్తూ సమయం వృథా అని విమర్శించారని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ పట్టుదలతో శ్రమించి 468M సబ్‌స్క్రైబర్లతో Mr Beast ప్రపంచంలోనే టాప్ యూట్యూబర్‌గా ఎదిగారు. ఇప్పటివరకు ఆ ఛానల్‌కు 11వేల కోట్ల వ్యూస్ రావడం విశేషం.

News February 20, 2026

చిక్కు తీసిన వెంట్రుకలను ఎక్కడ పడేస్తున్నారు?

image

తల దువ్వుకున్నాక రాలిన వెంట్రుకలను కొందరు ఇంటి మూలల్లో పారేస్తుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు పండితులు. దీనివల్ల ప్రతికూల శక్తి పేరుకుపోతుందని చెబుతున్నారు. ‘వెంట్రుకలు త్వరగా కుళ్లిపోవు. ఇవి గాలికి ఎగిరి మళ్లీ ఇంట్లోకే రావొచ్చు. ఆహార పదార్థాలలో పడొచ్చు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిని ఇంటికి బయట దూరంగా పడేయాలి. ఇలా చేస్తే రాహు దోషం తగ్గుతుంది’ అని చెబుతున్నారు.

News February 20, 2026

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<>CLRI<<>>) 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. Jr. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.53,628, Jr.సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.39,545, MTSకు రూ.35,973 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://clri.org