News January 23, 2026

కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసించేనా?

image

సౌతిండియాలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల తిరువనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కమలం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇవాళ మోదీ పర్యటన కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. వికసిత్ కేరళం అంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పీఠాన్ని కదిలించి కమలం జెండా ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కేరళలో బీజేపీ అధికారం చేపడుతుందా?

Similar News

News February 22, 2026

FDకి ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

image

FDకి స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ్ బ్యాంక్ ఐదేళ్ల టెన్యూర్‌కు 7.90%, ఉజ్జీవన్ బ్యాంక్ రెండేళ్లకు 7.45% ఇంట్రెస్ట్ అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో SBM Bank (18 నెలల నుంచి 2years 3days) టెన్యూర్‌కు 7.30% వడ్డీ ఇస్తోంది. RBL Bank 7% (18M to 3Y) అందిస్తోంది. పబ్లిక్ సెక్టార్‌లో పంజాబ్ & సింధ్ 6.75% (666 రోజులు), బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70% (450 రోజులు) హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి.

News February 22, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 4 హిందీ ట్రాన్స్‌లేటర్ గ్రూప్ -2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ(హిందీ, ఇంగ్లీష్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.48,000+HRA చెల్లిస్తారు. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News February 22, 2026

T20WC: శ్రీలంకపై ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?

image

పల్లెకెలె: భారీ హిట్టర్లున్న ఇంగ్లండ్ జట్టును శ్రీలంక తక్కువ పరుగులకే కట్టడి చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 రన్స్ చేసింది. ఓపెనర్ సాల్ట్ 62 పరుగులతో రాణించారు. చివర్లో విల్ జాక్స్(21) వేగంగా రన్స్ రాబట్టారు. వెల్లలాగే 3 వికెట్లతో సత్తా చాటారు. శ్రీలంక విజయ లక్ష్యం 147 పరుగులు.