News January 23, 2026
బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.
Similar News
News February 20, 2026
అసలు కడితే చాలు.. వడ్డీ మాఫీ: CS

AP: SC కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకున్న లబ్ధిదారులకు వాటి చెల్లింపులో GOVT వెసులుబాటు కల్పించింది. NSFDC, NSKFDC పథకాల కింద వాహనాలు, స్వయం ఉపాధి కోసం సంస్థ ₹260CR లోన్ ఇవ్వగా వడ్డీ ₹40CR అయ్యింది. APRలోగా అసలు కడితే వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామని CS విజయానంద్ ప్రకటించారు. సచివాలయంలో రుణాల రికవరీని సమీక్షించిన ఆయన వసూళ్లపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలన్నారు. ‘మనమిత్ర’పై అవగాహన కల్పించాలన్నారు.
News February 20, 2026
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాలో క్యాష్ పేమెంట్స్ ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయే అవకాశం ఉందని PIB వెల్లడించింది. అప్పటి నుంచి ఫాస్టాగ్, UPI ద్వారా మాత్రమే చెల్లింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు తగ్గట్లుగా ప్రయాణికులు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. హైవేలపై అడ్డంకులు లేని ప్రయాణాన్ని కల్పించడం, టెక్నాలజీని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
News February 20, 2026
ఏకసభ్య కమిషన్ ఛైర్మన్‌గా చంద్రబాబే ఉండాల్సింది.. భూమన ఎద్దేవా

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో <<19193937>>ఏకసభ్య కమిషన్<<>> నియామకాన్ని YCP నేత భూమన తప్పుబట్టారు. CBN కోరుకున్నట్లు CBI విచారణ జరగలేదన్నారు. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమే అని చెప్పారు. CBI సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ఛైర్మన్‌గా చంద్రబాబే ఉంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు.


