News January 23, 2026
వీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు

బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవడానికి చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. రోజులో 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటలు ఆహారాన్ని తీసుకుంటారు. దీన్ని సరిగ్గా పాటించకపోతే హైపోగ్లైసీమియా, హైపర్‌గ్లైసీమియాకి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతిని పాటించడం సరికాదంటున్నారు.
Similar News
News February 18, 2026
నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. లోకేశ్ సెటైర్

AP: కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు భారీగా ప్రజాధనం ఖర్చు చేశారనే ప్రచారంపై మంత్రి లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?’ అంటూ పుష్ప స్టైల్లో సెటైర్ వేశారు. కాగా లోకేశ్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
News February 18, 2026
లవర్స్ డే: పూల కంటే వాటినే ఎక్కువ కొన్నారు

లవ్ అంటే రోజా పువ్వు అనే ఆలోచన క్రమంగా మారుతోంది. ఈ వాలంటైన్స్ డేకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గులాబీలు, గిఫ్ట్స్ కంటే కండోమ్స్, శృంగార అనుబంధ ప్రొడక్టులే అధికంగా కొన్నారు. క్విక్ కామర్స్ రిపోర్ట్ ప్రకారం బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ ఇందులో టాప్‌లో ఉన్నాయి. చాక్లెట్స్-2, టెడ్డీస్-3లో ఉండగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, HYD, చెన్నైలో ఈ ఆర్డర్లు ఎక్కువొచ్చాయి. కోల్‌కతాలో ఓవ్యక్తి ₹25K చాక్లెట్స్ కొన్నాడు.
News February 18, 2026
భారత వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు: రిజిజు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో ఆయనకు సంబంధాలున్నాయన్నారు. దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. నక్సలైట్లు, తీవ్రవాదులను రాహుల్ కలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు జార్జ్ సొరోస్ వంటి నేతలను కలుస్తున్నారని ANIతో చెప్పారు.


