News January 23, 2026

చెన్నూర్: విద్యార్థులతో జిల్లా కలెక్టర్

image

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరు మండలంలోని కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.

Similar News

News February 20, 2026

నల్గొండ: ఫోన్ పేలో లంచాలు.. ఇద్దరిపై వేటు

image

డిజిటల్ చెల్లింపుల ముసుగులో అవినీతికి తెరలేపిన 8 మంది విద్యుత్ అధికారులను TGSPDCL సస్పెండ్ చేసింది. యాదాద్రి సర్కిల్‌లోని భువనగిరి ఆపరేషన్స్ ADE ఆనంద్‌రెడ్డి రూ.5వేలు, చౌటుప్పల్ లైన్‌మెన్ శ్రీనివాస్ రూ.45వేలు లంచం తీసుకున్నారని నిరూపితమైంది. వివిధ పనుల నిమిత్తం వినియోగదారుల నుంచి ఫోన్ పే ద్వారా లంచాలు వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి బాగోతం బట్టబయలైంది.

News February 20, 2026

జంగారెడ్డిగూడెం: మహిళ కడుపులో 8 కిలోల కణితి తొలగింపు

image

జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గురువారం జరిగింది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉన్నట్లు వైద్యుడు సంకు మురళి గుర్తించారు. ల్యాపరో స్కోప్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగించామన్నారు. కడుపు నొప్పితో సదరు మహిళా ఆసుపత్రికి వచ్చిందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

News February 20, 2026

‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్లాక్ అవుతుందా?

image

ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్‌ను మెటా <<19187218>>బ్లాక్<<>> చేయడంతో అతడిపై ఫిర్యాదు చేసిన BJP నేత కరాటే కళ్యాణి స్పందించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానెల్ సహా అన్నీ అకౌంట్లను డిలీట్ చేయించాలని CP సజ్జనార్‌ను కలవబోతున్నామని చెప్పారు. అలాగే పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరతామన్నారు. హిందువులను అన్వేష్ అవమానించారని, అతడికి జైలుశిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.