News January 23, 2026
గంగాపూర్ జాతరలో సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

రెబ్బెన(M) గంగాపూర్ గ్రామంలో జరగనున్న బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం గంగాపూర్ గ్రామాన్ని సందర్శించి జాతర మహోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచ్, ఇతర అధికారులతో సమీక్షించారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News April 10, 2026
ఇజ్రాయెల్ ఫైర్.. పోస్ట్ డిలీట్ చేసిన పాక్ మంత్రి

ఇజ్రాయెల్ ‘మానవాళికి శాపం’ అని, లెబనాన్‌లో ‘నరమేధం’ సృష్టిస్తోందంటూ పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీస్ తీవ్రంగా స్పందించింది. శాంతి చర్చల్లో మధ్యవర్తిగా ఉంటూ ఇజ్రాయెల్ అంతాన్ని కోరడం ఏంటని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలను అస్సలు సహించబోమని గట్టిగా హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన ఖవాజా తన ‘X’ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేశారు.
News April 10, 2026
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.
News April 10, 2026
పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.


