News January 23, 2026

ACB కోర్టులో చెవిరెడ్డికి ఊరట

image

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన.. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స పొందేందుకు కోర్టు 15 రోజులు పర్మిషన్ ఇచ్చింది. రోజూ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే చికిత్సకు అవకాశం ఉంటుంది. అనంతరం నిబంధనలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.

Similar News

News April 13, 2026

మెదక్: RJCలో 100% ఉత్తీర్ణత.. స్టేట్ టాపర్ శ్రావణి

image

మెదక్ TSRJC విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించారు. పరీక్షలకు హాజరైన మొత్తం 68 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో మన్నే శ్రావణి ఎంపీసీ విభాగంలో 992/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలిచింది. విద్యార్థుల అద్భుత ప్రతిభపై అధికారులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ విద్యాలయాల ఖ్యాతిని శ్రావణి మరోసారి చాటిచెప్పింది.

News April 13, 2026

కృష్ణా యూనివర్సిటీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2026లో నిర్వహించిన BA.LLB 7వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల(2025- 26 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 20లోపు ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం సూచించింది.

News April 13, 2026

కంగ్టి గిరిజన గురుకులంలో 100% ఉత్తీర్ణత

image

కంగ్టిలోని గిరిజన రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 17 మంది, ద్వితీయ సంవత్సరంలో 20 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందరూ పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. సెకండియర్‌లో బేగరి ఈశ్వర్ 928 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.