News January 23, 2026
శ్రీశైల మల్లన్న దంపతులకు ఘనంగా ఊయల సేవ

లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల మల్లన్న దంపతులకు శుక్రవారం రాత్రి ఊయల సేవ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలో స్వామి, అమ్మవారిని రకరకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పుష్పార్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రమణీయంగా సాగిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Similar News
News February 20, 2026
కృష్ణా: KTM పండుకు PT వారెంట్ జారీ

నేరాన్నే ప్రవృత్తిగా కలిగి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న యువకుడు KTM పండుకు కృష్ణాజిల్లా పోలీసులు PT వారెంట్ జారీ చేశారు. పెనమలూరు PS పరిథిలో గ్యాంగ్ వార్‌లను ప్రేరేపిస్తున్న అతనికి వారెంట్ జారీ చేసినట్లు SP విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పండుపై ఇప్పటి వరకు 18 కేసులు నమోదవ్వగా 2020లో రౌడీ షీట్ ఓపెన్ అయిందన్నారు. 2024లో PT వారెంట్ జారీ చేయగా అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.
News February 20, 2026
ధర్మారం: SRSP కాల్వ వంతెనపై యాక్సిడెంట్

ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వ వంతెనపై ఓ ఆటో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి అద్దాలు పగలడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ వడ్లూరి చిరంజీవి(36), బైక్‌పై ఉన్న గజ్జెల సురేశ్(35) తీవ్రంగా గాయపడగా, పోలీసులు వారిని చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 20, 2026
యంగ్ హీరోతో అనుపమ డేటింగ్?

అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌లో వీరిద్దరూ సెల్ఫీ తీసుకోగా దాన్ని ధ్రువ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అనుపమ ఆ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ లవ్ సింబల్ జోడించారు. అంతకుముందు ఓ వేడుకలోనూ రాత్రి 2 గంటలకు ఫోన్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారని అడగగా ధ్రువ్‌కి చేస్తా అని అనుపమ చెప్పారు. వీరిద్దరూ గతేడాది ‘బైసన్’ సినిమాలో నటించారు.


