News January 23, 2026
SRPT: లాకప్ డెత్‌లు ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చ

రాజేశ్ లాకప్ డెత్‌కు కారకులైన పోలీసులపై ఇతర శాఖల అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అఖిలపక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లాకప్ డెత్‌లు ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చ అన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.
Similar News
News April 18, 2026
‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News April 18, 2026
సంబేపల్లెలో గురుకుల విద్యార్థిని మృతి

సంబేపల్లె మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న రెడ్డిరాణి 14 (9వ తరగతి) విద్యార్థి శనివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News April 18, 2026
ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.


