News January 23, 2026

ఒక్క బంతికే 11 రన్స్

image

NZతో రెండో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగారు. ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్లో 22 రన్స్ బాదారు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 24 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ తొలి బంతి ఫోర్ వెళ్లగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత బౌలర్ 2 వైడ్లు వేశారు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 రన్స్ (4+nb+wd+wd+4) వచ్చినట్లయింది.

Similar News

News April 5, 2026

SRHకు షాక్.. అభి, హెడ్ ఔట్

image

IPL: అభిషేక్ శర్మ, హెడ్ అభిమానులను నిరాశ పరిచారు. లక్నోతో మ్యాచులో షమీ వేసిన తొలి ఓవర్లోనే అభి డకౌట్ అయ్యారు. బంతి ఎడ్జ్ తీసుకోగా సిద్ధార్థ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. అటు మూడో ఓవర్లోనూ షమీ వేసిన తొలి బంతికే హెడ్ సైతం క్యాచ్ ఔటయ్యారు. దీంతో మైదానంలోని ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం SRH స్కోర్ 2.1 ఓవర్లలో 8/2గా ఉంది.

News April 5, 2026

ఎలక్షన్స్.. రూ.651 కోట్లు సీజ్: EC

image

బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికలతోపాటు 6 రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాలపై ఈసీ పటిష్ఠ నిఘా ఏర్పాటుచేసింది. ఇప్పటి వరకు రూ.651 కోట్ల విలువైన లిక్కర్, డ్రగ్స్, డబ్బు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ప్రకటించింది. 5,173 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిత్యం తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. సాధారణ పౌరులకు వేధింపులు, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

News April 5, 2026

SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

image

SRHతో మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సలీల్ స్థానంలో లివింగ్‌స్టోన్, పైన్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు.

SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, ఉనద్కత్, శివాంగ్ కుమార్.
LSG: మార్ష్, పంత్ (C), మార్క్రమ్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్దార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్.