News January 24, 2026

నిర్మల్ ఉత్సవాలు మరొక రోజు పొడిగింపు: కలెక్టర్

image

ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలను ఆదరిస్తున్నందుకు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ అభిలాష అభినవ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజల కోరిక మేరకు నేటితో ముగియాల్సిన నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని మరొక రోజు (శనివారం వరకు) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఐదో రోజు నిర్మల్ ఉత్సవాల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.

Similar News

News January 26, 2026

5 సెకన్లలో 10 బుల్లెట్లు.. USను కుదిపేస్తున్న అలెక్స్ మరణం!

image

USలో ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో అలెక్స్ ప్రెట్టీ అనే వ్యక్తి మరణించడం దుమారం రేపుతోంది. ఇమిగ్రేషన్ అధికారుల దౌర్జన్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నందుకే అతడిపై 5 సెకన్లలో 10 బుల్లెట్లు పేల్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. అతడి వద్ద గన్ ఉందని అధికారులు వాదిస్తున్నా వీడియోల్లో మాత్రం ఫోన్ మాత్రమే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ట్రంప్ హయాంలోని ఏజెంట్ల దాష్టీకాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

News January 26, 2026

VASTHU: గేటు ఏ వైపున ఉండాలంటే?

image

ఇంటి ప్రధాన గేటు సింహద్వారానికి ఎదురుగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ప్రహరీ గోడ వెడల్పును బట్టి అవసరమైన సంఖ్యలో గేట్లు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘విడిగా చిన్న గేటు కావాలనుకుంటే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యంలో అమర్చుకోవాలి. పొరపాటున కూడా దక్షిణ నైరుతి, పడమర నైరుతిలో గేట్లు పెట్టకూడదు. ఇది సమస్యలకు దారితీస్తుంది’ అంటున్నారు. Vasthu

News January 26, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు

image

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. సిట్ విచారణకు సహకరించాలన్నారు.