News January 24, 2026

మంచిర్యాల: ‘పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

image

ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 747 పాఠశాలల్లో చదువుతున్న 37,749 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోజు విడిచి రోజు కోడి గుడ్డు అందిస్తున్నామన్నారు. 100 శాతం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Similar News

News February 1, 2026

ఖమ్మం: సీఐకు గాయం…పలువురిపై కేసు నమోదు

image

బందోబస్తు విధుల్లో ఉన్న వన్ టౌన్ సీఐ కరుణాకర్‌ను అడ్డుకుని, గాయపరిచిన పలువురిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పోయిలపొంగు ఉపేందర్, వెంకట్‌లను అరెస్టు చేసి కస్టడీకి తరలించినట్లు తెలిపారు. కార్యకర్తలు నమవరపు ఈశ్వర్, మాతేడి కిరణ్, భుక్య అశోక్, పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News February 1, 2026

మహిళా సాధికారతకు సరికొత్త బాట ‘షీ మార్ట్’

image

కేంద్ర బడ్జెట్ 2026లో మహిళలను వ్యాపార యజమానులుగా మార్చేందుకు ‘షీ మార్ట్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సొంత రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం పొందేలా మహిళలకు శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్థానిక పొదుపు సంఘాల్లో చేరి, నైపుణ్య శిక్షణ పొంది, బ్యాంకు రుణాల ద్వారా తమ వ్యాపార కలను సాకారం చేసుకోవచ్చు.

News February 1, 2026

పోలీసులు వేధించారని జడ్జి ఎదుట అంబటి ఆవేదన: YSRCP Legal Cell ట్వీట్

image

తనను పోలీసులు శారీరకంగా వేధించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సెల్ నుంచి బయటకు తెచ్చి కాళ్లు వెడల్పుగా చేయించి నిలబెట్టారని, దీనివల్ల తీవ్ర నొప్పులు వస్తున్నాయని కోర్టుకు తెలిపారు. తనపై దాడి జరిగినా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ పేర్కొంది.