News January 24, 2026

HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

image

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

Similar News

News February 6, 2026

ఆర్మూర్: కుటుంబ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

image

భర్త కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆర్మూర్‌కు చెందిన వివాహిత సాగరిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధనంగా రూ.20 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు వేధించడంతో తీవ్ర మనోవేధనకు గురై ఉరేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తమ్ముడు సాయి కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

News February 6, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 6, 2026

పదో తరగతి పబ్లిక్ ఫీజు కట్టని వారికి మరో అవకాశం

image

పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు కట్టని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని
చీపురుపల్లి స్థానిక ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి గురువారం తెలియజేశారు. తత్కాల్ స్కీం ద్వారా అపరాధ రుసుం రూ.1000లు చెల్లించి నామినల్ రోల్స్‌లో ఈనెల 6 నుంచి 12 దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫీజును www//bse.ap.gov.in వెబ్సైట్‌లో లాగిన్ అయి CFMS బ్యాంక్ చలానా ద్వారా చెల్లించాలని సూచించారు.