News January 24, 2026

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: NLG ఎస్పీ

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె.జాన్ రెడ్డి ఆధ్వర్యంలో రీజియన్ స్థాయిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ.. ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 18, 2026

అనకాపల్లి: ‘రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

image

రెవిన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం రెవిన్యూ అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సేవల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. జిల్లాలో వివాదహితంగా భూ రికార్డులను తయారు చేయాలన్నారు. లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలన్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

News February 18, 2026

తిరుపతి: ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు

image

ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని RIO రాజశేఖరరెడ్డి తెలిపారు. ఫీజుల పేరుతో విద్యార్థులను కాలేజీలు వేధిస్తున్నాయని Way2Newsలో <<19174095>>వార్త <<>>రాగా.. ఆయన స్పందించారు. ‘bieap వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా రోల్ నంబర్, పుట్టిన తేదీతో హాల్‌టికెట్ పొందవచ్చు. హాల్ టికెట్‌పైన ప్రిన్సిపల్ సంతకం, స్టాంప్ అవసరం లేదు. విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.

News February 18, 2026

పార్వతీపురం: ‘మార్చి 14న జాతీయ లోక్ అదాలత్’

image

ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులు, ఇతర అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పార్వతీపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతుందన్నారు. ఈ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కాంపౌండబుల్, బ్యాంకు రుణాలు తదితర కేసులు పరిష్కరిస్తామన్నారు.