News January 24, 2026
దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి కేకే లైన్ దూరమవుతోందా?

కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం లభిస్తోంది. కొత్తవలస జంక్షన్‌తో పాటు శ్రీకాకుళం జిల్లాలో పలు సెక్షన్లు రాయగడ డివిజన్‌కు వెళ్లే పరిస్థితి తలెత్తుతోంది. రైల్వేలో ఉత్తరాంధ్రపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఈ మార్గం కోల్పోతే జోన్ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుంది.
Similar News
News January 29, 2026
ప.గో: వైకల్యాన్ని జయించి.. విజేతలుగా నిలిచి..

నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ చాటారు. లాంగ్‌జంప్‌లో పెంటపాడుకు చెందిన స్నేహలత, రన్నింగ్‌లో మోగల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి శ్రీరామకృష్ణ వర్మ తృతీయ స్థానాలు సాధించి కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను SSA అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యాంసుందర్, IE కోఆర్డినేటర్ శ్రీనివాస్ అభినందించారు.
News January 29, 2026
Oh Sh*t.. పైలట్ల ఆఖరి మాటలు ఇవే

బారామతి ఫ్లైట్ క్రాష్‌లో మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా ప్రాణాలు కోల్పోయారు. క్రాష్ ల్యాండింగ్‌కి ముందు వాళ్లు మాట్లాడిన ఆఖరి మాటలు కాక్‌పిట్‌లో రికార్డ్ అయ్యాయి. వాళ్లు కొన్ని క్షణాల ముందు ‘Oh Sh*t’ అని కేకలు వేసినట్లు DGCA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి.
News January 29, 2026
HYD: పైకం ఇంకెన్నడు ఇస్తరు?

గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు TGHB 3 ప్రాంతాల్లో 111 LIG ఫ్లాట్లకు జనవరి 6న లాటరీ తీశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్షగా నిర్ణయించగా, మొత్తం 2,663 అప్లికేషన్‌లు వచ్చాయి. ఫ్లాట్ రాని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే 22 రోజులు గడిచినా ఇప్పటికీ పైకం రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తాము చెల్లించిన పైకం రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


