News January 24, 2026

శుభ సమయం (24-1-2026) శనివారం

image

➤ తిథి: శుద్ధ షష్టి రా.10.58 వరకు ➤ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.8.05-8.26 వరకు, ఉ.10.18-1.05 వరకు, మ.2.01-మ.2.56 వరకు, సా.4.48-5.44 వరకు➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ➤ యమగండం: మ.1.30-మ.3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.6.35-8.04 వరకు ➤ వర్జ్యం: రా.12.43-2.15 వరకు ➤ అమృత ఘడియలు: ఉ.8.34-10.08 వరకు

Similar News

News April 7, 2026

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు GOOD NEWS

image

TG: జీతాల కోసం ప్రతి నెలా 20వ తేదీ వరకు ఎదురుచూసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే నెల నుంచి ఇది పక్కాగా అమలు చేయాలని, ఏప్రిల్ నెల జీతం మే 1వ తేదీన ఖాతాల్లో వేయాలని స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 4.80లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు.

News April 7, 2026

టాస్ గెలిచిన ముంబై

image

రాజస్థాన్‌తో మ్యాచులో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. గాయం కారణంగా గత మ్యాచుకు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచుకు అందుబాటులోకి వచ్చారు.
MI: రోహిత్, రికెల్టన్, తిలక్, సూర్య, హార్దిక్, నమన్ ధీర్, శార్దూల్, చాహర్, ఘజన్‌ఫర్, బౌల్ట్, బుమ్రా
RR: జైస్వాల్, వైభవ్, జురెల్, రియాన్, హెట్‌మెయర్, ఫెర్రీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, దేశ్‌పాండే, సందీప్

News April 7, 2026

భూమి అస్తమించడం చూశారా?

image

ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను షేర్ చేస్తోంది. లేటెస్ట్‌గా భూమి అస్తమిస్తున్నట్టుగా చంద్రుడి ఉపరితలం నుంచి తీసిన ఫొటోను పంపించింది. దీంతో పాటు పరిభ్రమణలో భాగంగా చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి గ్రహణంలా కనిపించిన ఫొటోనూ రిలీజ్ చేసింది. చంద్రుడి నుంచి భూమి వ్యూస్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.