News January 24, 2026
వరంగల్ మార్కెట్‌కి 3 రోజుల వరుస సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం రిపబ్లిక్ డే సందర్బంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News April 9, 2026
కఠినాత్ముల మనస్సు కరిగించలేం!

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: వంపుగా ఉన్న కర్రను వేడి చేసి తిన్నగా చేయవచ్చు. కొండలను కూడా పిండి చేయవచ్చు. కానీ మొండి పట్టుదల లేదా కఠినాత్ముల మనస్సును కరిగించడం సాధ్యం కాదు.
<<-se>>#PADHYAM<<>>
News April 9, 2026
‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ బ్యూటీ?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో యంగ్ హీరోయిన్ మానస వారణాసి స్టెప్పులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్ కోసం మూవీ టీమ్ ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బ్యూటీ ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. కాగా స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
News April 9, 2026
చిత్తూరు: ఆరెంజ్ జోన్‌లో రెండు మండలాలు

బుధవారం అత్యధికంగా నగరిలో 42.1, గంగవరంలో 40.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు మండలాలు ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లాయి. పలమనేరులో 40.5, నిండ్రలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.8, వెదురుకుప్పం, పులిచెర్లలో 39.5, రొంపిచెర్లలో 39.3, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్లో 39.1, గుడిపాలలో 38.9, పూతలపట్టులో 38.6, పాలసముద్రం, పెద్దపంజాణి, పెనుమూరు, యాదమరి(M)లో 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.


