News January 24, 2026

వరంగల్, హన్మకొండ జిల్లాల కలయికకు బ్రేక్ పడినట్లేనా?

image

WGL, HNK జిల్లాలు కలుస్తాయని ఆశించిన వారి కలలు కల్లలయ్యాయి. కలిసి ఉన్న WGL, HNK పట్టణాలు.. జిల్లాలుగా మాత్రం వేరుగా ఉన్నాయి. ఈ రెండు నగరాలను అంటే వరంగల్, హన్మకొండ జిల్లాలను ఒకే జిల్లా చేయాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు ప్రభుత్వ సైతం తాజాగా అడుగులు వేసినట్లే కనిపిచింది. దీంతో రెండు జిల్లాలు ఒక్కటవుతాయనే ఆశలో ప్రజలు ఉన్నారు. అయితే, తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణతో బ్రేక్ పడినట్లయింది.

Similar News

News February 15, 2026

శివయ్య సేవలో SP రాజేశ్ చంద్ర.. రథోత్సవంతో మొదలైన సందడి!

image

రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామేశ్వర లింగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవాన్ని కామారెడ్డి SP రాజేశ్ చంద్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. అనంతరం సంతాయిపేట భీమేశ్వర ఆలయ బందోబస్తును పరిశీలించి, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. భక్తులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

News February 15, 2026

ములుగు: సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

మునిసిపాలిటీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రేపు (సోమవారం) జరగనున్న ప్రజావాణి( గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జరిగే మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో జిల్లా అధికారులు పాల్గొననున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు.

News February 15, 2026

మాస శివరాత్రి, మహా శివరాత్రి.. తేడాలేంటి?

image

ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చేది మాస శివరాత్రి. మాఘ మాసంలో వచ్చేది మహా శివరాత్రి. ఏడాదికి 12 మాస శివరాత్రులు వస్తాయి. మహా శివరాత్రి ఒక్కసారే వస్తుంది. మాస శివరాత్రి మనశ్శాంతి, పాపక్షయం కోసం జరుపుకొంటారు. శివుడు లింగోద్భవమైన, శివపార్వతుల కళ్యాణం జరిగిన మహా శివరాత్రిని అత్యంత విశేషంగా జరుపుకొంటారు. రెండింటిలోనూ ఉపవాసం, జాగారం, అభిషేకాలు ప్రధానమే. అయితే మహా శివరాత్రి అత్యున్నతమైనది.