News January 24, 2026

కర్నూలు: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 8 మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు, 2 మినీ కార్యకర్తలు, 54 ఆయా పోస్టుల భర్తీకి కలెక్టర్ డా.ఏ.సిరి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల మహిళా అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లో సమర్పించాలని ఆమె సూచించారు.

Similar News

News February 19, 2026

టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయలేదు: BR నాయుడు

image

AP: కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన YCP హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని స్పష్టం చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బొత్స విషయాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. దేవదేవుని సొమ్ముని నైవేద్యాలకు, అన్న ప్రసాదాలకు వాడే అంశంలో రాజీపడేది లేదని ట్వీట్ చేశారు.

News February 19, 2026

చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

image

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

News February 19, 2026

ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గురువారం శాసనసభలో మాట్లాడారు. సైబర్ వర్టికల్ వింగ్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.2కోట్లతో అధునాతనమైన సైబర్ ఫోరెన్సిక్ పరికరాలను సమకూరుస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.