News January 24, 2026

పలాశ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు: స్మృతి ఫ్రెండ్

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ పలాశ్‌పై <<18931442>>ఫిర్యాదు<<>> చేసిన విజ్ఞాన్ మానే మరిన్ని ఆరోపణలు చేశారు. ‘ఆ రోజు పెళ్లి వేడుకలో నేను ఉన్నాను. అతను మరో యువతితో మంచంపై ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారు’ అని ఆరోపించారు. దీనిపై పలాశ్ స్పందించారు. ‘ఇవన్నీ నా రెప్యుటేషన్ దెబ్బతీయాలని చేస్తున్న నిరాధార ఆరోపణలు. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటాను’ అని తెలిపారు.

Similar News

News February 7, 2026

805 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

C-DAC 805 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో HYDలో 105 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News February 7, 2026

వాలంటైన్స్ డే స్పెషల్.. బెస్ట్ బడ్జెట్ ట్రిప్ డెస్టినేషన్స్

image

వాలంటైన్స్ డే సందర్భంగా భాగస్వామితో కలిసి ప్రకృతి ఒడిలో సమయాన్ని గడపాలనుకుంటున్న వారికి తెలుగు రాష్ట్రాల్లోనే చల్లని హిల్ స్టేషన్లు ఉన్నాయి. రూ.10,000-రూ.12,000 బడ్జెట్‌లోనే 2-3 రోజుల ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. TG ఊటీగా పిలవబడే ‘అనంతగిరి హిల్స్’ తక్కువ ధరలో అద్భుతమైన అనుభూతినిస్తుంది. APలోని ‘అరకు వ్యాలీ’, ‘లంబసింగి’, ‘హార్స్‌లీ హిల్స్’ ఫిబ్రవరిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.

News February 7, 2026

ఇంటర్వ్యూతో కడప GDCHలో ఉద్యోగాలు

image

AP: కడప జిల్లాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీ& హాస్పిటల్(GDCH) 9 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. MDS అర్హత గలవారు ఎల్లుండి(FEB 9)ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పీజీ మెరిట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 44ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.2000, BC, SC, STలకు రూ.1000. నెలకు జీతం రూ.74,750 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in