News January 24, 2026

Grok సేవలకు అంతరాయం

image

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.

Similar News

News April 9, 2026

దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

image

ఎండాకాలంలో జంతువులు నీడ, నీరు లేక అల్లాడిపోతాయి. దాహమేస్తోందని అడగలేవు కూడా. అందుకే వాటి బాధను మనం అర్థం చేసుకుందాం. ఇందుకోసం మీరు చేయాల్సింది ఇంటి ముందర చిన్న తొట్టె లేదా బకెట్లో నీళ్లు నింపి పెట్టడమే. మండే ఎండల్లో దాహంతో ఉన్న పక్షులు, జంతువులు ఆ నీటితో కడుపు నింపుకుంటాయి.
Share It

News April 9, 2026

పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయ్: కేంద్రం

image

శబరిమలలోకి 10-50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఆంక్షలను కేంద్రం సమర్థించింది. ఇది వివక్ష కాదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న <<19599264>>ఆచారాన్ని<<>> గౌరవించడమేనని తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ వాదనలు వినిపించారు. దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇది పురుషాధిక్య/ స్త్రీ ఆధారిత విశ్వాసాలకు సంబంధించింది కాదన్నారు.

News April 9, 2026

చిన్న సినిమా రూ.100 కోట్లు కొల్లగొట్టింది!

image

మరో మలయాళం సినిమా అదరగొట్టింది. నవీన్ SA దర్శకత్వం వహించిన వజా-2 మూవీ 10 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టింది. స్కూల్లో వేస్ట్ బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న నలుగురు కుర్రాళ్లు జీవితంలో సెటిల్ కావడానికి ఎలా కష్టపడ్డారనేదే ఈ చిత్ర కథ. సింపుల్ ఎమోషన్స్, క్లీన్ కామెడీ, అనుబంధాలతో డైరెక్టర్ చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌కూ పెద్దపీట వేశారు. మూవీ బడ్జెట్ రూ.5-10 కోట్లు.