News January 24, 2026
పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.
Similar News
News February 23, 2026
నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
News February 23, 2026
పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
News February 23, 2026
ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉంటే?

ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉండటం చాలా మంచిదని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. ‘దానివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీనిని లివింగ్ రూమ్‌లో ఉంచితే కుటుంబసభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు బలపడతాయి. నెమలి అందం ఇంటికి ఆకర్షణీయ రూపాన్నిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతిమంగా సానుకూల మార్పులకు దారి తీస్తుంది’ అంటున్నారు.


