News January 24, 2026
మార్చి నుంచి బాలయ్య కొత్త మూవీ షురూ!

‘అఖండ2’తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. అయితే గతంలో అనుకున్న కథను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కొత్త కథతో రాబోతున్నట్లు సమాచారం. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వీరసింహారెడ్డి తెరకెక్కింది.
Similar News
News February 11, 2026
వందేమాతరం.. ఇకపై లేచి నిలబడాల్సిందే!

అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్‌లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. సినిమాలు, డాక్యుమెంటరీ లేదా న్యూస్‌రీల్ మధ్యలో వందేమాతరం వస్తే మాత్రం థియేటర్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.
News February 11, 2026
ఘోర ప్రమాదం.. ఆరుగురు యువకుల దుర్మరణం

రాజస్థాన్‌లోని జైపూర్-ఆగ్రా NHపై నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు మరణించారు. పెళ్లికి హాజరై తిరిగి కారులో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులు సమయ్ (25), లోకేశ్ (24), దిల్‌కుష్ (24), మనీశ్ (23), అంకిత్ (26), నవీన్ (23)గా గుర్తించారు. వారంతా మంచి మిత్రులంటూ కలాఖో గ్రామస్థులు కన్నీరుపెట్టుకున్నారు.
News February 11, 2026
క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.


