News January 24, 2026

DANGER‌.. HYD ఎయిర్ క్యాలిటీ @240

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శనివారం సికింద్రాబాద్‌‌లో తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత కాస్త పెరిగింది.

Similar News

News January 26, 2026

HYDలో ‘గణతంత్ర’ వేడుకులు.. దీనికి అర్థం తెలుసా?

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగర వ్యాప్తంగా మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. మరీ గణతంత్రం అంటే అర్థం తెలుసా? ‘గణతంత్రం’ అనేది ప్రజలకు అధికారం కలిగిన పాలనా విధానం. ఇందులో దేశాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎన్నుకుంటారు. రాజు లేదా వారసత్వ పాలకుడు ఉండరు. తమను తాము పరిపాలించుకుంటామని ఓటు హక్కుతో ప్రతినిధులను ఎన్నుకుని దేశ పాలనను నిర్వహింపజేస్తారు.
*నేడు 77వ గణతంత్ర దినోత్సవం

News January 26, 2026

HYDలో పండగే.. నేడు కేజీ SALE

image

HYD లక్డీకాపూల్‌లోని మారుతీ గార్డెన్స్‌లో ‘కిలో బుక్ ఫెయిర్’ సందడి మొదలైంది. MRP రేట్లతో పనిలేకుండా, కూరగాయలు కొన్నట్లుగా పుస్తకాలను కిలోల లెక్కన సొంతం చేసుకోవచ్చు. UK, USA నుంచి వచ్చిన పది లక్షల పైచిలుకు పుస్తకాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. 5 కేజీల బాక్స్‌ తీసుకుంటే కిలో ₹399 మాత్రమే! పిల్లల కథల పుస్తకాల నుంచి ఫిక్షన్, నాన్-ఫిక్షన్ వరకు అన్నీ దొరుకుతాయి. ఇవాళ జరిగే ఈ వేడుకను మిస్ కాకండి!

News January 26, 2026

HYD: బులెట్ దిగినా.. హెడ్ కానిస్టేబుల్ తగ్గేదేలే!

image

గచ్చిబౌలిలో ప్రిజం పబ్ వద్ద నిందితుడు ప్రభాకర్‌ను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డి సాహసం చేశారు. నిందితుడి కాల్పుల్లో కాలికి గాయమైనప్పటికీ, తగ్గకుండా ప్రాణాలకు తెగించి అతడిని బంధించారు. ఈ అసాధారణ ధైర్యసాహసానికి వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డును ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.