News January 24, 2026

బాపట్ల జిల్లా ప్రయాణికులకు గుడ్ న్యూస్.!

image

ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన తిరువనంతపురం–చర్లపల్లి <<18930504>>అమృత్ భారత్<<>> ప్రత్యేక రైలు శనివారం బాపట్ల స్టేషన్‌కు రానుంది. ఉదయం 10.20 గంటలకు గుంటూరు, అనంతరం బాపట్లకు రానుంది. ఈ మార్గంలో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు గుంటూరు స్టేషన్‌లో ఘన స్వాగతం పలకాలని రైల్వే వినియోగదారుల సంఘాలు నిర్ణయించాయి. ప్రయాణికులకు కొత్త కనెక్టివిటీ అందనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 3, 2026

నల్లగొండ: పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా సాగుతోంది. మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు జి.రమేష్ సమక్షంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ రెండో విడత ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని 162 వార్డులు, 475 పోలింగ్ కేంద్రాలకు గాను.. 20 శాతం రిజర్వుతో కలిపి మొత్తం 1713 మంది సిబ్బందిని కేటాయించారు.

News February 3, 2026

Trade Deal: మనపై 18% టారిఫ్స్.. వాళ్లపై ‘సున్నా’ సుంకాలా?

image

ట్రేడ్‌ డీల్‌లో భాగంగా US వస్తువులపై ఇండియా సున్నా టారిఫ్స్ విధిస్తుందని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. దీనిపై భారత ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. ఒకవేళ చేసినా.. వేటికి జీరో టారిఫ్స్ వర్తిస్తాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బహుశా కొన్ని సెలక్టెడ్ అమెరికన్ ప్రొడక్ట్స్‌పై దశలవారీగా సుంకాలు భారీగా తగ్గిస్తామన్న హామీ లభించిందని ట్రంప్ ఉద్దేశం అయి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

News February 3, 2026

మేడారం: అత్యాచారం జరగలేదు.. అసత్య ప్రచారాలపై సీరియస్

image

మేడారం మహా జాతర సందర్భంగా బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ములుగు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి తెలిపారు. నార్లాపూర్ పోలీసులు సమగ్ర విచారణ జరపగా, అలాంటి ఘటన ఏదీ జరగలేదని నిర్ధారణయిందన్నారు. తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.