News January 24, 2026

కొత్తవలస రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ రైళ్ల నిలుపుదల

image

అమృత్ భారత్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతున్న కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పలు అమృత్ భారత్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ సీఎమ్ కె. పవన్ కుమార్ తెలిపారు. రైళ్లు (16597/98, 16223/24, 16107/08, 16523/24) ఇకపై ఇక్కడ ఆగనున్నాయన్నారు. ఈ రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా విజయనగరం, కొత్తవలస, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 26, 2026

విజయనగరం కలెక్టర్ కాంప్ కార్యాలయంలో ఘనంగా ఎట్ హోమ్ కార్యక్రమం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కాంప్ కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు శాస్త్రీయ సంగీతాన్ని మనోహరంగా ఆలపించారు. జిల్లా అధికారులు, సిబ్బంది సందడిగా గడిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, SP దామోదర్, JC సేధు మాధవన్, కమాండెంట్ మహేష్, అదనపు SP సౌమ్యలత, DRO మురళి పాల్గొన్నారు.

News January 26, 2026

VZM: ‘ఆసుపత్రికి వెళుతూ ఇద్దరూ చనిపోయారు’

image

బొండపల్లి (M) గొట్లాం సమీపాన బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం <<18950810>>జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం<<>> తెలిసిందే. అయితే ఎల్లయ్య పైల్స్‌తో బాధపడుతుండగా.. వరుసకు అల్లుడయ్యే రామునాయుడు బైకుపై VZM ఆసుపత్రికి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రాము నాయుడుకు భార్య, రెండేళ్ల పాప ఉన్నారు. ఎల్లయ్య భార్యకు దూరంగా ఒంటరిగా ఉన్నారు.

News January 25, 2026

అవార్డు అందుకున్న విజయనగరం కలెక్టర్

image

బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డుకు విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉత్తమ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, నూతన విధానాల అమలు వంటి అంశాల్లో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిందని అధికారులు ప్రశంసించారు.