News January 24, 2026
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ఒగ్గుడోలు

TG: గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం కాబోతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌పై తొలిసారి మన ఒగ్గుడోలు కళను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి నేతృత్వంలోని 30 మంది బృందం ఈ చారిత్రక అవకాశం దక్కించుకుంది. ఢిల్లీలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా 15 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటనున్నారు.
Similar News
News February 7, 2026
దివ్యాంగులకు వెసులుబాటు కల్పించిన UPSC

సివిల్స్ ఎగ్జామ్స్ రాసే దివ్యాంగుల(Pwbd)కు పరీక్షా కేంద్రం ఎంపికలో <<19061199>>UPSC<<>> వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులు కోరుకున్న కేంద్రాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. గరిష్ఠ సామర్థ్యం(ఫుల్ స్ట్రెంత్) చేరుకున్నప్పటికీ దివ్యాంగ అభ్యర్థులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనుంది. అవసరమైన చోట పరీక్షా కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతామని UPSC తెలిపింది. అయితే ఇది ఇతరులకు వర్తించదని స్పష్టం చేసింది.
News February 7, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<
News February 7, 2026
రేపు పఠించాల్సిన సూర్య మంత్రాలు

సూర్యారాధనలో మంత్ర పఠనం అత్యంత శక్తిమంతంగా పని చేస్తుందని నమ్మకం. ‘ఓం సూర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో సూర్య ప్రచోదయాత్’ అనే సూర్య మంత్రం బుద్ధిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగిస్తుంది. ‘ఓం సూర్యాయ నమః’ అనే సూర్య అష్టాక్షరి మంత్రం కూడా చాలా ప్రభావవంతమైనది. సూర్యోదయం సమయంలో ఈ మంత్రాలను పఠిస్తూ అర్ఘ్యం వదిలితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరంలో కొత్త శక్తి ఉత్తేజితమవుతుంది.


