News January 24, 2026
నిజామాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఉమ్మడి నిజామాబాద్ అర్హత కల్గిన నిరుద్యోగ SC, ST, BC, మైనారిటీ అభ్యర్థులకు నిజామాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 5 నెలల పాటు RRB, బ్యాంకింగ్, SSC, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు DD(SCDD) రాజగంగారం తెలిపారు. ఇందు కోసం ఆన్‌లైన్‌లో www.tsstudycircle.co.inలో జనవరి 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9951199460 సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 14, 2026
సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: ADB SP

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. APK లింకులు, AI వీడియో కాల్స్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ వారం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930కు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని ఆయన స్పష్టం చేశారు.
News February 14, 2026
బడ్జెట్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్‌కు రూ. 638 కోట్లు

శాసనసభలో 2026-27 వార్షిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీకి రూ.638 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలోని పోలీసులకు 3,000 కొత్త పోలీసు వాహనాలు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం బడ్జెట్ కేటాయించారు.
News February 14, 2026
కాళేశ్వరంలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవార్లకు పూర్ణాభిషేకం నిర్వహించి, అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పాలపొరక, రక్షాబంధనం, దీక్షా వస్త్రధారణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఋత్విక్ వర్ణన, మృత్సం గ్రహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. క్షేత్రమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగుతోంది. ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.


